నమస్కారం! నా పేరు అశోక్ ఆనంద్. శ్రీరంగం శ్రీనివాసరావు గారు జన్మించిన అదే విశాఖపట్నం వాసుణ్ణి. నేను వేరే ఉద్యోగాలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సినిమా రంగంలోకి వచ్చిన వాణ్ని కాను. పూర్తిగా సినిమానే నమ్ముకుని ఊపిరి పీల్చుకుంటున్న వాడిని. విషయానికి వస్తే, నేను గతంలో 'మంచి కాఫీ లాంటి కథ' మరియు 'ది గోల్డెన్ రోజ్' అనే రెండు లఘు చిత్రాలకు రచన మరియు దర్శకత్వం వహించాను. మరియు మూడు పాటలను రాశాను. అందులో ఒక పాటకు, సుమంత్ గారి 'మళ్ళీరావా', రాజశేఖర్ గారి 'కల్కి' చిత్రాలకు సంగీతం చేసిన శ్రవణ్ భరద్వాజ్ గారి సారథ్యంలో సాహిత్యం కూర్చాను. నా కాంటాక్ట్ నంబర్ ను క్రింద జత పరుస్తున్నాను. ఆ నంబర్‌ను సంప్రదించినట్లయితే నా సాహిత్యాన్ని మీకు పంపిస్తాను. నా పాటలను విని, అందులోని సాహిత్యం గనుక మీకు నచ్చి, అక్షరాలకు అర్హుడినే అని మీరు భావిస్తే నాకీ అవకాశం ఇవ్వగలరని అభ్యర్థిస్తూ, ఆకాంక్షిస్తూ .. ధన్యవాదాలు. ఫోన్ నంబర్ - 9381232456